- రాజస్థాన్ నుంచి ప్రారంభించనున్న ప్రధాని మోదీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రధాన మంత్రి కృషి సమృద్ధి కేంద్రాలను పార్టీ నేతలు ప్రారంభిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపా రు. వివిధ జిల్లాల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో బీజేపీ నేతలు, రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొంటారని ప్రేమేందర్ బుధవారం ఓ ప్రకటనలో తెలి పారు. రాజస్థాన్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని చెప్పారు.
రైతు సంక్షేమాన్ని కాంక్షించే కార్యక్రమంలో రైతులందరూ స్వచ్ఛందంగా పాలుపంచుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారని చెప్పారు. అందు లో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న 2.8 లక్షల ఎరువుల దుకాణాలను ‘వన్ స్టాప్ మోడల్ ఫర్టిలైజర్ షాపులు’గా మారుస్తూ ‘ప్రధాన మంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ పేరుతో ప్రజలకు కేంద్రం అందుబాటులోకి తీసుకొస్తున్నదన్నారు. మొదటి విడతగా 1.25 లక్షల ఎరువుల దుకాణాలను మోదీ రాజస్థాన్ నుంచి ప్రారంభిస్తారని వెల్లడించారు. అలాగే మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మంచిర్యాలలో కృషి సమృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తారని ప్రేమేందర్ వెల్లడించారు.
నేడు గజ్వేల్‌కు కిషన్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం గజ్వేల్‌లో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన ఓ సంఘటనలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను ఆయన పరామర్శించనున్నారు.

