మేషం (మార్చి21 – ఏప్రిల్20)
ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. ఎంతగా కష్టించినా ఫలితం స్వల్పమే. ఆస్తుల విషయంలో సోదరులతో స్వల్ప వివాదాలు. దూరపు బంధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. వారాంతంలో శుభవర్తమానాలు, ఆకస్మిక ధనలాభం.
వృషభం (ఏప్రిల్21 – మే21)
ఆదాయం కొంత ఊరటనిస్తుంది. డబ్బు సమకూరినా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉండవచ్చు. విహారయాత్రలు చేస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులకు లావాదేవీలు కొంత లాభిస్తాయి. ఉద్యోగులు విధుల్లో స్వల్ప మార్పులు పొందుతారు. వారారంభంలో విందువినోదాలు. శుభవర్తమానాలు.
మిథునం (మే22 – జూన్22)
ఆదాయం సంతృప్తికరం. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. విలువైన వస్తుసామగ్రి కొంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కే ఛాన్స్.
కర్కాటకం (జూన్23 – జూలై23)
రాబడి ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పరపతి పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు నెమ్మదిస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాల సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. సమాజంలో ప్రత్యేక గౌరవం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు అనుకున్న హోదాలు, ఇంక్రిమెంట్లు లభించవచ్చు.
సింహం (జూలై24 – ఆగస్టు22)
ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు తీరతాయి. దీర్ఘకాలిక వివాదాలు, సమస్యలు తీరి ఒడ్డున పడతారు. ఆలోచనలకు కార్యరూపం. సమాజంలో పరపతి పెరుగుతుంది. స్థలాలు, ఆభరణాలు కొంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉండవచ్చు.
కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్22)
ఆశించిన ఆదాయం సమకూర్చుకుంటారు. సన్నిహితులు, స్నేహితులు చేదోడుగా నిలుస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. కొన్ని వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. మీ మనసుకు తోచిన విధంగా నడుచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగవర్గాలు అనుకున్న పదోన్నతులు దక్కించుకుంటారు.
తుల (సెప్టెంబర్23 – అక్టోబర్22)
కొన్ని కార్యాలు విజయవంతం. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. రాబడి అవసరాలకు తగినంతగా అందుతుంది. సోదరులు, బంధువుల నుంచి శుభవర్తమానాలు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి.
వృశ్చికం (అక్టోబర్23– నవంబర్22)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీసేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. భూములు, వాహనాలు సమకూరతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి.
ధనుస్సు (నవంబర్23 – డిసెంబర్22)
మకరం (డిసెంబర్23 – జనవరి22)
కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22)
మీనం (ఫిబ్రవరి23 – మార్చి20)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. యుక్తితో ఎంతటి సమస్య ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మీయుల ఆదరణ. సమాజంలో పరపతి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్: 98852 99400
