వెస్ట్ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పై తృణముల్ కార్యకర్తల దాడి – వీడియో

వెస్ట్ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పై తృణముల్ కార్యకర్తల దాడి – వీడియో

వెస్ట్ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ జయ ప్రకాశ్ ముధిరాజ్ పై దాడి చేశారు తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ రోజు వెస్ట్ బెంగాల్ కరీంపూర్ బైపోల్  ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్ లో జయ ప్రకాశ్ పోటీ చేస్తున్నారు. సోమవారం పొద్దున పోలింగ్ బూత్ కు చేరుకున్న జయప్రకాశ్…  కారు దిగడంతోనే ఆయనను చుట్టుముట్టిన తృణముల్ కార్యకర్తలు దాడి చేశారు. జయప్రకాశ్ ను కొడుతూ, తంతూ నూకేయడంతో ఆయన ముళ్ళ కంపలో పడ్డారు.

వెస్ట్ బెంగాల్ లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు జయ ప్రకాశ్. TMC కార్యకర్తలు రిగ్గింగ్ చేయడానికి చూస్తున్నారని, తాను గమనించినందుకే తనపై దాడిచేశారని అన్నారు. వారు ఎన్ని దాడులు చేసినా తాను ప్రతీ పోలీంగ్ బూత్ ను సందర్శిస్తానని తెలిపారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

ఈ ఘటనపై తృణముల్ కాంగ్రెస్ నాయకులు స్పందించారు. జయప్రకాశ్ పై దాడి చేసింది స్థానిక ప్రజలని, తృణముల్ కార్యకర్తలు కాదని చెప్పారు. ఆయన స్థానిక వాతావరణాన్ని పొల్యూట్ చేసినందుకు  జయప్రకాశ్ పై వారు దాడి చేశారని అన్నారు.