నోటిలో చుట్ట, అమ్మాయితో బాడీ మసాజ్.. గేల్ ఎంజాయ్

నోటిలో చుట్ట, అమ్మాయితో బాడీ మసాజ్.. గేల్ ఎంజాయ్

'క్రిస్ గేల్..' ఈ వెస్టిండీస్ వీరుడి గురుంచి తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. తాను కొట్టే భారీ సిక్సర్లు చూసి బౌలర్లు భయపడితే, తన భారీ ఖాయాన్ని చూసి పసిపిల్లలు భయపడతారు. అలా కనిపిస్తారు. ఇక గేల్ బట్టలు విప్పాడంటే.. పెద్దలు కూడా భయపడాల్సిందే. ఒంటి నిండా టాటూలతో హాలీవుడ్ సినిమాల్లో నటించే విలన్‌లా ఉంటారు.     

ప్రస్తుతానికి ఆటకు దూరంగా ఉంటున్న గేల్.. లైఫ్‌ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. పబ్‌లు.. పార్టీలు అంటూ పది మంది అమ్మాయిలతో చేరి నానా హంగామా చేస్తున్నారు. ఇది తనకు కొత్త కాకపోయినా.. ఎంజాయ్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గేల్‌కు అలవాటు. వీటిని చూసి అభిమానులు కుళ్లుకుంటుంటారు. తాజాగా గేల్ మరో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో గేల్ చుట్ట కాలుస్తూ ఉండగా.. వెనక నిల్చొని ఓ యువతి అతనికి బాడీ మసాజ్ చేస్తోంది.

ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. 'అనుభవించు రాజా' అంటూ గేల్‌ను పొగుడుతున్నారు. డబ్బు సంపాదిస్తే సరిపోదని వాటిని ఎలాంటి వాటికి  ఖర్చు చేయాలో గేల్‌ను చూసి నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.