లాడర్‌హిల్ (యూఎస్): ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (74), సైమ్ అయూబ్ (66) ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టడంతో వెస్టిండీస్‌తో మూడో టీ20లో పాకిస్తాన్ 13 రన్స్ తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–-1 తేడాతో కైవసం చేసుకుంది. సోమవారం ఉదయం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 189/4 స్కోరు చేసింది. ఓపెనర్లు సైమ్, ఫర్హాన్ తొలి వికెట్‌కు 138 రన్స్ భారీ భాగస్వామ్యం నెలకొల్పి బలమైన పునాది వేశారు.
కరీబియన్ బౌలర్లలో హోల్డర్, ఛేజ్, షమార్ జోసెఫ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో విండీస్ ఓవర్లన్నీ ఆడి 176/6 స్కోరు మాత్రమే చేసి ఓ డింది. ఓపెనర్ అలిక్ అతానజె (60), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (51) ఫిఫ్టీలతో పోరాడినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం విండీస్‌ను దెబ్బతీసింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ, సైమ్ మరో ముగ్గురు తలో వికెట్ పడగొట్టారు. ఫర్హాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మహ్మద్ నవాజ్‌కు సిరీస్ అవార్డులు లభించాయి. పాక్, విండీస్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి.
