
హైదరాబాద్ : ఇంట్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను పట్టుకున్నామని తెలిపారు మారేడ్ పల్లి పోలీసులు. రైల్ నిలయం అంబెడ్కర్ నగర్ కు చెందిన నిందితుడు టమాట శివని అరెస్ట్ చేసి, 33తులాల బంగారం, 1వెయ్యి నగదు, ల్యాప్ టాప్ స్వాదీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు మారేడ్ పల్లి SI శ్రీనివాసులు.
నేపాల్ నుండి బతుకు దేరువు కోసం హైదరాబాద్ కు వచ్చి, ఇక్కడే స్థిరపడిన కుటుంబానికి చెందిన టమాట శివ బాల్యం నుండే దొంగ తనాలు, గంజాయి, మద్యం మొదలైన దూర్వ్యసనాలకు అలవాటు పడ్డాడు. బాల్యంలోనే పట్టుబడి జువైనల్ కు వెళ్ళాడు. అయిన తన ప్రవర్తన మార్చుకోకుండా దొంగతనాలు చేస్తున్నాడు. మారెడ్ పల్లిలో ఇంటి తాళాలు పగుల గొట్టిన చోరీ కేసులో సిసి కెమెరాలు,ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితున్ని గుర్తించామని ఇన్స్ పెక్టర్ తెలిపారు.
స్థానికులు సిసి కెమెరాలు అమార్చుకోవాలని విన్నపం చేశారు. విహార యాత్రలకు, ఇతర ప్రాంతాలకు ఎక్కువ రోజులు వెళితే పీఎస్ లో సమాచారాం ఇవ్వండి. ఆయా ప్రాంతాలలో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి రక్షణ కల్పిస్తామని తెలిపారు పోలీసులు.