సర్కార్ జాగాలో గుళ్లు కడ్తుంటే ఏం చేస్తున్నరు?

సర్కార్ జాగాలో గుళ్లు కడ్తుంటే ఏం చేస్తున్నరు?

పర్మిషన్ లేకున్నా ఎందుకు ఆపుతలేరు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్‌ మండలం నాగోల్‌ గ్రామంలో ని సర్కార్ స్థలం (1,200 చదరపు గజాలు)లో పర్మిషన్ లేకుండా ఆలయాలను కడుతుంటే ఏం చేస్తున్నారని హైకోర్టు అధికా రులను ప్రశ్నించింది. ఒకవేళ అక్కడ నిర్మాణాలను చేపడితే, వెంటనే అడ్డుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు మల్కా జిగిరి జిల్లా కలెక్టర్, జీహెచ్‌‌ఎంసీ హయత్‌ నగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్, ఉప్పల్‌ తహసీల్దార్, ఎల్‌ బీ నగర్‌ పోలీసులకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అక్కడికి వెళ్లి పరిశీలించి, ఈనెల 18లోగా రిపోర్టు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సర్కార్ స్థలంలో మహంకాళి, పోచమ్మ ఆలయాలు నిర్మిస్తున్నారని, కంప్లయింట్ చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని లోకల్ వ్యక్తి వజీర్‌ ప్రకాశ్ గౌడ్‌ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌ ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌సేన్‌‌ రెడ్డి ల డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.