బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య రెండో సినిమాకు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య రెండో సినిమాకు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram pothineni) హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri jagannadh) కాంబోలో వచ్చిన మాస్ మసాలా మూవీ ఇష్మార్ట్ శంకర్(Ismart shankar). 2019లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గరా భారీ విజయాన్ని అందుకుంది.లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఈ మూవీపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య(Vaishnavichaitanya) ఈ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని టాక్. 

ఈ మూవీలో రామ్ ఎనర్జీకు మ్యాచ్ అయ్యే క్వాలిటీస్ వైష్ణవికి పుష్కలంగా ఉండటంతో ఒకే చేశారంట పూరీ. దీంతో బేబీ ఫ్యాన్స్ మస్త్ ఖుషి అవుతున్నారు. ఇటీవల రామ్ పోతినేని వైష్ణవిని ప్రత్యేకంగా పూలగుచ్ఛం  ఇస్తూ అభినందించారు..దీంతో పూరి జగన్నాధ్ వైష్ణవికి ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. 

హీరోయిన్స్ కు అద్దిరిపోయే డైలాగ్స్ రాయటంలో పూరీ మార్క్ కిరాక్ ఉంటుందని తెలిసిందే. దీంతో వైష్ణవి లక్కీ చార్మ్ అంటున్నారు. అంతే కాకుండా ఈ మూవీలో నటించడానికి వైష్ణవి భారీ రెమ్యూనరేషన్ తీసుకోనుందని తెలుస్తోంది. కోటి రూపాయిల వరకు  రెమ్యునరేషన్ వైష్ణవి అడగటంతో..పూరి టీం ఒకే అన్నట్లు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇక ఇంత రెమ్యూనరేషన్ బాలీవుడ్ స్టార్స్ కి ఇచ్చే బదులు..మన టాలీవుడ్ హీరోయిన్స్ కు ఇవ్వటంలో బెస్ట్ అవుట్ ఫుట్ రాబోట్టొచ్చని పూరీ ఆలోచన. 

బేబీ మూవీతో వైష్ణవి యాక్టింగ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.దీంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న వైష్ణవి ఈ మూవీతో మరో లెవెల్ కు వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. వైష్ణవి సినిమాల్లో కు రాకముందు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఫస్ట్ టైం అల్లు అర్జున్  అల వైకుంఠపురం మూవీలో సిస్టర్ పాత్రలో నటించింది. 

రామ్ అండ్ పూరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ సినిమాను సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ పూరి అండ్ రామ్ కు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది తెలియాలంటే 2024 మార్చ్ 8వరకు ఆగాల్సిందే.