చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....

చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....

హిందూమతంలో పౌర్ణమి రోజుకి ( ఏప్రిల్​ 23) ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో ఒక పౌర్ణమి మరియు సంవత్సరంలో 12 పౌర్ణమిలు వస్తాయి.  ప్రతి పూర్ణిమ తిథికి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా చైత్ర పౌర్ణమికి అన్నింటికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.  చైత్ర పౌర్ణమి ( ఏప్రిల్​ 23) ఎలా పూజించాలో  తెలుసుకుందాం..

హిందూ పురాణాల ప్రకారం చైత్ర మాసం పౌర్ణమి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే  చైత్ర మాసం  తెలుగు సంవత్సరాల్లో మొదటి మాసం. ...  మొదటి నెల. ముఖ్యంగా ఈ చైత్ర పౌర్ణమి  ( 2024, ఏప్రిల్​ 23) నాడు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు.  హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర పూర్ణిమ హిందూ నూతన సంవత్సరం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజుగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక రోజునే హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటారు.

 దృక్‌ సిద్దాంత పంచాంగ గణితం ఆధారంగా చైత్ర మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి 23 ఏప్రిల్‌ 2024 మంగళవారం రోజు వచ్చింది. చైత్ర శుద్ద పౌర్ణమి లేదా మదన పూర్ణిమ అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున  (ఏప్రిల్​ 23) పరమేశ్వరుడిని, విష్ణువుని, హనుమంతుడిని పూజించాలని  పండితులు చెబుతున్నారు.  ఈ పౌర్ణమి రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. చైత్ర శుద్ద పౌర్ణమి రోజే  దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగాన్ని చేయడంతో పాటు...  మదన పౌర్ణమినాడు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించి, కుమారులను పొందారని పురాణాలు చెబుతున్నాయి.

  • మదన పూర్ణిమ రోజు ( ఏప్రిల్​ 23)  రామాయణ పారాయణం శుభ ప్రదం. మదన పూర్ణిమ రోజు సాయంత్రం దీపాలు వెలిగించడం చాలా మంచిది . విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి చైత్ర శుద్ద పౌర్ణమి రోజు అనువైన రోజు. 
  • చైత్ర పూర్ణిమ రోజున తెల్లవారుజామున నిద్రలేచి నదిలో స్నానం చేస్తే పాపాలు నయమవుతాయి.  అలాగే ఈ రోజున విష్ణువు మరియు హనుమంతుడిని పూజించాలి.
  • ఈ రోజున ( 2024, ఏప్రిల్​ 23)  చైత్ర పూర్ణిమ వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తిని, చంద్రుడిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల వర్తమాన, పూర్వ పాపాలు తొలగిపోతాయి.
  • శ్రీమహావిష్ణువును పూజిస్తూ, సత్యనారాయణ వ్రతాన్ని చేయండి తప్పకుండా సత్యనారాయణ కథ వినండి. ఈ పూజలో విష్ణువుకు పండ్లు, తమలపాకులు, అరటి ఆకులు, ధూపం, చందనం సమర్పించాలి.
  • భగవద్గీత, రామాయణం పారాయణం చేస్తే కష్టాలు తొలగిపోతాయి. అలాగే చైత్ర పూర్ణిమ నాడు దానాలు చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.