కాంగ్రెస్​ అధ్యక్ష  పదవికి దూరంగా లేను

కాంగ్రెస్​ అధ్యక్ష  పదవికి దూరంగా లేను

కాంగ్రెస్​ అధ్యక్ష  పదవిపై భారత్​ జోడో యాత్రలో రాహుల్​ గాంధీ క్లారిటీ ఇచ్చారు. అధ్యక్ష  ఎన్నికలకు దూరంగా లేననే  సంకేతాలు ఇచ్చారు. తాను కాంగ్రెస్​ అధ్యక్షుడిని అవుతానా? లేదా అనేది పార్టీ  ఎన్నికలప్పుడు స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఏం చేయాలో తానో నిర్ణయంపై ఉన్నానని తెలిపారు. అందులో ఎలాంటి గందరగోళం లేదన్నారు. అందమైన దేశంలో ఈ రెండు మూడు నెలలు యాత్ర చేపట్టడం ద్వారా పరిస్థితులు అర్థం చేసుకునేందుకు తనకు ఓ అవకాశం దొరుకుతుందన్నారు. కొన్ని విషయాలపై పూర్తిస్థాయి అవగాహనతో సమర్థంగా రాటుదేలగలను అనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. రెండు రోజుల తర్వాత కౌంటింగ్​ చేపట్టి ఫలితం ప్రకటిస్తారు. సెప్టెంబర్​ 24 నుంచి 30 వ తేదీల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్​లో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్లు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. అందులో కపిల్​ సిబల్​, అశ్వనీకుమార్​, గులాంనబీ ఆజాద్​ హస్తం పార్టీకి గుడ్​ బై చెప్పారు. వారు బయటకు వెళ్తూ రాహుల్​ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్​ కు రాజకీయ పరిపక్వత లేదని..అనుభవం లేని కారణంగా అనేక పరాజయాలు చవిచూడాల్సి వచ్చిందని ఆరోపించారు.

సెప్టెంబర్​ 21న నాటికి కాంగ్రెస్​ కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. కానీ ఆ గడువును నెల రోజులు పొడిగించారు. 2019లో బీజేపీ ఘన విజయం సాధించి రెండోసారి​ప్రధాని మోడీ అధికారం కైవసం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్​ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్​ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.