గుడ్ న్యూస్..వాట్సాప్‌లో బిల్ పేమెంట్ సేవలు.. ఇక అన్ని బిల్స్‌ యాప్‌లోనే చెల్లించుకోవచ్చు

గుడ్ న్యూస్..వాట్సాప్‌లో బిల్ పేమెంట్ సేవలు.. ఇక అన్ని బిల్స్‌ యాప్‌లోనే చెల్లించుకోవచ్చు

సోషల్ మీడియా మేసేజింగ్ యాప్ వాట్సాప్  తన కస్టమర్లకోసం  కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇకపై అన్ని రకాల బిల్లులు యాప్ లోనే చెల్లించేలా  బిల్స్ పేమెంట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.  కరెంట్ బిల్లు, గ్యాస్, వాటర్, ఇన్సూరెన్స్, క్రిడిట్ కార్డు, లోన్ రీపేమెంట్స్ ఇలా అన్ని రకాల బిల్లులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా చెల్లించుకోవచ్చు. ఇందుకోసం భారత కనెక్ట్ నెట్ వర్క్ తో కలిసి పనిచేస్తుంది. 

న్యూఢిల్లీ:  సోషల్ ​మెసేజింగ్​ యాప్ ​వాట్సాప్ బిల్స్​ పేమెంట్​ సేవలను ప్రారంభించింది. భారత్ కనెక్ట్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ఆధారంగా ఈ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులు కరెంట్​, గ్యాస్, నీరు, ఫాస్టాగ్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు, లోన్ రీపేమెంట్లు వంటి 30 రకాల 22,700 పైగా బిల్లర్లకు సులభంగా డబ్బు చెల్లించవచ్చు. యాప్ హోమ్ స్క్రీన్ పైభాగంలో కనిపించే ప్రత్యేక సింబల్​ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. 

గతంలో చేసిన చెల్లింపులను చూడటంతో పాటు రాబోయే బిల్లులను ముందుగానే ట్రాక్ చేయవచ్చు. వాట్సాప్​ పేరెంట్​ కంపెనీ మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు డిజిటల్ చెల్లింపులను చేరువ చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కునాల్ షా వాట్సాప్​ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న రెండో ప్రధాన ప్రకటన ఇది. ఇప్పటికే బ్రౌజర్ కాలింగ్ సేవలను కూడా ఈ సంస్థ​ తీసుకొచ్చింది. అన్ని రకాల బిల్స్​ను సులువుగా చెల్లించేలా ఈ ఫీచర్​ను తీర్చిదిద్దామని అరుణ్ ​వివరించారు.