సూపరో సూపర్..రెండో సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో గెలిచిన టీమిండియా

సూపరో సూపర్..రెండో సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో గెలిచిన టీమిండియా
  •     మూడో టీ20లోనూ ఓడిన అఫ్గానిస్తాన్‌‌‌‌
  •     సెంచరీతో దంచికొట్టిన రోహిత్ 
  •     3-0తో సిరీస్‌‌‌‌ క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌

బెంగళూరు :  బంతి బంతికి ఉత్కంఠను పెంచుతూ.. ఓవర్ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆధిపత్యం చేతులు మారుతూ..  ఇంటర్నేషనల్ టీ20ల్లో తొలిసారి రెండు సూపర్ ఓవర్లకు దారి తీసిన హిస్టారికల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో చివరకు టీమిండియాదే పైచేయి అయింది. బుధవారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో, చివరి టీ20లో ఇండియా రెండో సూపర్ ఓవర్లో  అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను 3–0తో క్లీన్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ చేసింది.  కెప్టెన్ రోహిత్ శర్మ (69 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్‌‌‌‌‌‌‌‌) సెంచరీకి తోడు రింకూ సింగ్ (39 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 69 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఫిఫ్టీతో దంచడంతో తొలుత ఇండియా 20 ఓవర్లలో 212/4 స్కోరు చేసింది. ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు ఈ ఇద్దరూ రికార్డు స్థాయిలో 190 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో  గుల్బదిన్ నైబ్‌‌‌‌‌‌‌‌ (55 నాటౌట్), రహ్మనుల్లా గుర్బాజ్‌‌‌‌‌‌‌‌ (50), ఇబ్రహీం జద్రాన్ (50) మెరుపులతో అఫ్గానిస్తాన్ సైతం 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 212 స్కోరు చేసింది. దాంతో విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తేల్చేందుకు సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించారు. ‌‌‌‌‌‌‌‌ తొలి సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్లో అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ 16 రన్స్‌‌‌‌‌‌‌‌ చేయగా.. ఇండియా కూడా 16 రన్స్ చేసింది.  రెండో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో రోహిత్‌‌‌‌‌‌‌‌ 6,4తో సత్తా చాటడంతో  ఇండియా 5బాల్స్‌‌కు  11 రన్స్‌‌‌‌‌‌‌‌కు రెండు వికెట్లు (ఆలౌట్) కోల్పోయింది. అఫ్గాన్‌‌‌‌‌‌‌‌12 రన్స్ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌కు రాగా రోహిత్‌‌‌‌‌‌‌‌ అనూహ్యంగా రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌తో బౌలింగ్ చేయించాడు. బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ తొలి బాల్‌‌‌‌‌‌‌‌కు నబీని, మూడో బాల్‌‌‌‌‌‌‌‌కు రహ్మనుల్లా గుర్బాజ్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో అఫ్గాన్ ఒకే రన్‌‌‌‌‌‌‌‌ చేసి ఓడింది. రోహిత్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌, శివం దూబేకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. 

తడబడి.. చెలరేగి

టాస్‌‌‌‌‌‌‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇండియా పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేలో తడబడింది. దూకుడుగా ఆడే ప్రయత్నంలో బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. లెఫ్టార్మ్ పేసర్ ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో యశస్వి జైస్వాల్ (4)తో పాటు విరాట్ కోహ్లీ (0), సంజూ శాంసన్ (0) పుల్ షాట్లు ఆడి గోల్డెన్ డకౌటయ్యారు. ఇక, వరుస ఫిఫ్టీలతో ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న శివం దూబే (1) అజ్ముతుల్లా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చిక్కాడు.  ఐదు ఓవర్లకు ఇండియా 22/4తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌ తోడుగా రోహిత్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దాడు. సలీమ్ వేసిన ఎనిమిదో ఓవర్లో చెరో సిక్స్‌‌‌‌‌‌‌‌తో ఇద్దరూ వేగం పెంచగా సగం ఓవర్లకు ఇండియా 61/4తో నిలిచింది. ఈ లెక్కన 150–160 స్కోరు చేస్తే గొప్పే అనిపించింది. కానీ, 12వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రోహిత్ ఊచకోత మొదలైంది. తన ట్రేడ్‌‌‌‌‌‌‌‌ మార్క్ షాట్లకు తోడు రివర్స్ స్వీప్ షాట్లతోనూ ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్టేడియాన్ని ఉర్రూతలూగిస్తూ 41 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో రింకూ కూడా క్రమం తప్పకుండా బౌండ్రీలు కొడుతూ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. అజ్మతుల్లా వేసిన  19వ ఓవర్లో రోహిత్ వరుసగా 6,4,4తో సెంచరీ అందుకున్నాడు. లాస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌కు రింకూ సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. జనత్ వేసిన ఆఖరి ఓవర్లో హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ 4, 6 (నోబ్‌‌‌‌‌‌‌‌), 6 రాబట్టగా..  చివరి మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌ను స్టాండ్స్‌‌‌‌‌‌‌‌కు పంపిన రింకూ స్కోరు 200 దాటించి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు సూపర్ ఫినిషింగ్ ఇచ్చారు. చివరి రెండు ఓవర్లలోనే ( 22, 36) ఇండియా ఏకంగా 58  రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టడం విశేషం. ఫరీద్ మూడు వికెట్లు తీశాడు.  

అఫ్గాన్ ధనాధన్

భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఆరంభం నుంచే చెలరేగింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్‌‌‌‌‌‌‌‌, ఇబ్రహీం జద్రాన్స్వేచ్ఛగా షాట్లు కొట్టారు. అవేశ్ వేసిన రెండో ఓవర్లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో బౌండ్రీ ఖాతా తెరిచిన ముకేష్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో  4,6 కొట్టాడు.  మధ్యలో కాస్త స్పీడు తగ్గినా దూబే  బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో జద్రాన్ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గుర్జాజ్‌‌‌‌‌‌‌‌ 4,6 బాదడంతో సగం ఓవర్లకు అఫ్గాన్ 85/0తో నిలిచింది. కుల్దీప్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న గర్బాజ్ మరో షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 93 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. 13వ ఓవర్లో సుందర్ వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో  జద్రాన్‌‌‌‌‌‌‌‌, ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జామ్‌‌‌‌‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి అఫ్గాన్‌‌‌‌‌‌‌‌కు డబుల్ షాకిచ్చాడు. కానీ, గుల్బదిన్ నైబ్‌‌‌‌‌‌‌‌, నబీ (34)  భారీ షాట్లతో రెచ్చిపోవడంతో 16 ఓవర్లకు అఫ్గాన్ 162/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో  సుందర్..  స్లో వైడ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో నబీని ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆ వెంటనే జనత్ (2) రనౌటవగా.. కోహ్లీ పట్టిన సూపర్ క్యాచ్‌‌‌‌‌‌‌‌కు నజీబుల్లా (5) ఔటయ్యాడు. అయినా  నైబ్‌‌‌‌‌‌‌‌  పోరాటం వదల్లేదు. 19వ ఓవర్లో ఓ భారీ సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. ముకేశ్‌‌‌‌‌‌‌‌ వేసిన  చివరి ఓవర్లో 19 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరం అవగా..  ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిక్స్‌‌‌‌‌‌‌‌తో పాటు చివరి రెండు బాల్స్‌‌‌‌‌‌‌‌కు రెండు డబుల్స్‌‌‌‌‌‌‌‌ తీసిన అతను స్కోర్లు సమం చేశాడు. సుందర్ మూడు వికెట్లు పడగొట్టాడు. 

1 ఇంటర్నేషనల్ టీ20ల్లో రెండు సూపర్ ఓవర్లు ఆడించిన తొలి మ్యాచ్‌ ఇది. 2020 ఐపీఎల్‌లో పంజాబ్, ముంబై మధ్య మ్యాచ్‌ కూడా రెండు సూపర్ ఓవర్లకు దారి తీసింది. ఇక, 2019 వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్లోనూ సూపర్ ఓవర్‌‌ టై అవగా బౌండరీ కౌంట్ ఆధారంగా విన్నర్‌‌ను (ఇంగ్లండ్‌)తేల్చారు.

42 అత్యధికంగా 42 టీ20ల్లో  గెలిచిన ఇండియా కెప్టెన్‌‌గా ధోనీ రికార్డును రోహిత్ సమం చేశాడు.

121 టీ20ల్లో రోహిత్‌‌కు ఇది హయ్యెస్ట్‌‌ స్కోరు. 2017లో శ్రీలంకపై ఇండోర్‌‌‌‌లో చేసిన 118 రన్స్‌‌ను అధిగమించాడు.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 212/4 (రోహిత్ 121*, రింకూ సింగ్ 69*, ఫరీద్ 3/20).
అఫ్గానిస్తాన్: 20 ఓవర్లలో 212/6 (నైబ్ 55*, గుర్బాజ్ 50, ఇబ్రహీం జద్రాన్ 50, సుందర్ 3/18).