ఆన్‌లైన్‌లో ఏదైనా అప్లై చేసేటప్పుడు, డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫొటోలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్ లోడ్ చేయమని అడుగుతుంటారు. ఫోన్‌లో సేవ్ అయిన ఫొటోలను పీడీఎఫ్ కు మార్చడం చాలా ఈజీ. దానికోసం ఏం చేయాలంటే..
ముందుగా గూగుల్ ఫొటోస్ యాప్‌లో మీకు కావాల్సిన ఫొటోను వెతకాలి. ఫొటో ఓపెన్ చేశాక పైన కుడివైపు కార్నర్‌లో మూడు డాట్స్ కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేస్తే.. కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో ‘ప్రింట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. పైన ‘సెలక్ట్ ప్రింటర్’ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే.. ‘సేవ్ యాజ్ పీడీఎఫ్’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ సింబల్ కనిపిస్తుంది. అది నొక్కి ఫొటోను పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు.
ఫోన్ లాక్ మర్చిపోతే..
మొబైల్‌కు లాక్ స్క్రీన్ సెట్ చేసుకోవడం వల్ల ఇతరులు ఫోన్‌ను ఓపెన్ చేయడానికి వీలుండదు. అయితే ఎప్పుడైనా పిన్ నంబర్ లేదా ప్యాటర్న్ మరచిపోతే? ఫేస్ ఐడీ లేదా ఫింగర్ ప్రింట్ సరిగా పనిచేయకపోతే? అప్పుడు ఫోన్‌ను అన్‌లాక్ చేయటం ఎలా?
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండే ‘ఫైండ్ మై డివైజ్’ అనే ఫీచర్ ద్వారా మొబైల్ పోయినప్పుడు లేదా లాక్ స్క్రీన్ పాస్‌వర్డ్ మర్చిపోయినప్పుడు, ఫింగర్ ప్రింట్ సెన్సర్ పనిచేయనప్పుడు మొబైల్‌ను రిమోట్‌గా అన్‌లాక్ చేయొచ్చు. ముందుగా డెస్క్‌టాప్ లేదా ల్యాప్ టాప్‌లో ‘గూగుల్ ఫైండ్ మై డివైజ్’ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. లాక్ అయిన ఫోన్‌కు లింక్ అయి ఉన్న గూగుల్ అకౌంట్‌తో సైన్‌ఇన్ కావాలి. అప్పుడు గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న మొబైల్స్ లిస్ట్ కనిపిస్తుంది.
లాక్ అయిన ఫోన్ పేరు మీద క్లిక్ చేయాలి. ‘లాక్’ ఆప్షన్ నొక్కాలి. టెంపరరీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి.. ‘లాక్’ బటన్‌ను నొక్కితే.. రింగ్, లాక్, ఎరేజ్ అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో లాక్‌ను ఎంచుకోవాలి. తర్వాత టెంపరరీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు లాక్ అయిన ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆ టెంపరరీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే చాలు. ఫోన్ అన్‌లాక్ అవుతుంది. అయితే ఈ ఫీచర్ పనిచేయాలంటే మొబైల్‌లో గూగుల్ ఫైండ్ మై డివైజ్ ఎనేబుల్ చేసి ఉండాలి. అన్‌లాక్ చేయాలనుకుంటున్న ఫోన్‌లో ఇంటర్నెట్ ఆన్ చేసి ఉండాలి.
యాప్స్ దాచొచ్చు!
ఫోన్‌లో ఉండే యాప్స్‌లో కొన్ని పర్సనల్ యాప్స్ లేదా ప్రొఫెషన్‌కు సంబంధించిన యాప్స్ కూడా ఉండి ఉండొచ్చు. అయితే వాటిని ఇతరులు చూడకుండా ఉండాలంటే కేవలం స్క్రీన్ లాక్ మాత్రమే సరిపోదు. ఎందుకంటే ఎప్పుడైనా మొబైల్ లాక్ చేయడం మర్చిపోతే పర్సనల్ డేటా లీక్ అయ్యే అవకాశం ఉంది. అందుకే పర్సనల్ ఫైల్స్ ఉన్న యాప్స్‌ను కనిపించకుండా దాచేందుకు హైడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆండ్రాయిడ్‌లో. ఈ ఫీచర్‌తో యాప్స్ ఇతరుల కంట పడకుండా చూసుకోవచ్చు.
యాప్స్ హైడ్ చేయడం కోసం ఫోన్ సెటింగ్స్‌లోకి వెళ్లి ‘ప్రైవసీ లేదా సెక్యూరిటీ’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ‘ప్రైవసీ ప్రొటెక్షన్’ ట్యాబ్‌లో ‘హైడ్’ ఆప్షన్ కనిపిస్తుంది. పాస్‌వర్డ్ లేదా పిన్ ఎంటర్ చేసి, హైడ్ చేయాలనుకుంటున్న యాప్స్‌ను ఎంచుకోవాలి. లేదా సెట్టింగ్స్‌లో పైన సెర్చ్ బార్‌లో ‘హిడెన్ యాప్స్’ అని టైప్ చేసినా ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి యాప్స్ హైడ్ చేయొచ్చు. హైడ్ చేసిన యాప్స్ ఓపెన్ చేయడానికి స్పెషల్ గెశ్చర్స్ ఉంటాయి. పాస్‌వర్డ్ లేదా పిన్ ఎంటర్ చేస్తేనే ఆ యాప్స్ కనిపిస్తాయి.
