వేములవాడ, వెలుగు: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో వేములవాడ అభివృద్ధిలో వెనుకబడిందని, రెండేళ్లలో తాము చేస్తున్న అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌తో కలిసి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, వేములవాడలో తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. గతంలో వారికి అవకాశం ఇస్తే వేములవాడ పట్టణ అభివృద్ధిని విస్మరించారని, ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. సమావేశంలో చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పుల్కం రాజు, బొజ్జబారతి, సిర్రం శిరిష, నామాల ఉమ, కసా శ్రీనివాస్, బుట్టి రమేశ్, వెంకటస్వామి పాల్గొన్నారు.
వైభవంగా గోవిందరాజుల స్వామి కల్యాణం
చందుర్తి, వెలుగు: చందుర్తి మండలం సనుగులలో గోవిందరాజుల స్వామి కల్యాణం ఆదివారం వైభవంగా సాగింది. ఆలయ నిర్మాణ దాత, శాశ్వత చైర్మన్ ఉప్పుగంటి గోవిందరావు, శోభలత దంపతుల ఆధ్వర్యంలో స్వామి కల్యాణం నిర్వహించారు. ఈ వేడుకకు విప్ ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
