
పద్మారావునగర్, వెలుగు: తెల్ల కోటు స్వచ్ఛతకు ప్రతీకగా నిలుస్తుందని, మెడికల్ స్టూడెంట్స్ కష్టపడి చదివి ప్రజలకు సేవ చేయాలని అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ శివరాం ప్రసాద్ అన్నారు. బుధవారం గాంధీ మెడికల్ కాలేజీలో 2025 బ్యాచ్ మెడికల్ స్టూడెంట్స్కు వైట్ కోట్ సెర్మనీ నిర్వహించారు. ఆయన హాజరై స్టూడెంట్స్కు తెల్ల కోట్లు అందజేశారు.