పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకిస్తలే..

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకిస్తలే..

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ ఎందుకు జరపడం లేదని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకివ్వడం లేదన్నారు. కృష్ణ, గోదావరిలో తెలంగాణ నీటి వాటా ఎందుకు తేల్చడం లేదంటూ నిలదీశారు. వీటికి సమాధానం చెప్పేవరకు ప్రజలు బీజేపీని నమ్మరని రేవంత్ ట్వీట్ చేశారు.

కాగా యాదగిరి గుట్టలో జరిగిన బీజేపీ ప్రజాసంగ్రామ సభలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇంజనీరింగ్ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపు హౌస్లు మునిగాయన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్  కట్టారని..కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు డబ్బు సంపాదించే మిషన్ గా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్... ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ జంగ్ సైరన్ మోగించిందని..వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ నాయకత్వంలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.