
భార్యాభర్తలు గొడవ పడుతుండగా వారిద్దరిని ఆపేప్రయత్నంలో.. భార్య తరఫు బంధువుపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ దారుణపైన ఘటన జీడిమెట్ల పియస్ పరిధిలో చోటుచేసుకుంది. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని వల్లభాయి పటేల్ నగర్ లో నవత్ వినయ్ కుమార్, స్వప్న దంపతులు నివాసం ఉంటున్నారు. 2007 లో వీరికి వివాహం అయ్యింది, స్వప్న అంగన్ వాడి కేంద్రంలో హెల్పర్ గా, వినయ్ కుమార్ స్దానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 2020 సంవత్సరంలో భర్త వినయ్ శాపూర్ నగర్ లో నివాసం ఉండే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో భార్య స్వప్న ఎన్నోసార్లు భర్తకు అక్రమ సంబంధం మానుకోమని చెప్పుంది.
అయినా వినయ్ కుమార్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో శనివారం రాత్రి స్వప్న తల్లిదండ్రులు, చెల్లి, మామ రవిలు శాపూర్ నగర్ లో మరో మహిళతో సహజీవనం చేస్తున్న వినయ్ ఉన్న ప్రదేశానికి వెళ్లారు. వినయ్ కుమార్ ను భార్య బంధువులు మందలించారు. కోపంతో వినయ్ కుమార్ భర్యను చితకబాదడంతో బంధువు రవి గొడవను ఆపడానికి అడ్డురావడంతో వినయ కుమార్ చాకుతో రవిపై దాడి చేశాడు. ఈ ఘటనలో రవి మెడ, ఎడమ చేతికి తీవ్ర గాయీలైయ్యాయి. స్దానికులు వెంటనే రవిని చికిత్స నిమిత్తం శాపూర్ నగర్ లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.