మహిళను వివస్త్రను చేసి.. కట్టేసి కారం చల్లి దాడి

మహిళను వివస్త్రను చేసి.. కట్టేసి కారం చల్లి దాడి

వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను వివస్త్రను చేసి.. ఓంటిపై కారం చల్లి దాడి చేసిన ఘటన కామారెడ్డిజిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కాపూర్ గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్త గత కొంత కాలంగా తన మొదటి భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళతో నరేష్ సహజీవనం చేస్తున్నాడు.  

నరేష్ మహిళతో సహజీవనం చేస్తున్న విషయం తెలుసుకున్న అతని భార్య, ఆమె బంధువులు..  భర్తతోపాటు సదరు మహిళను పట్టుకుని దేహశుద్ది చేశారు. ఇద్దరినీ వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి.. ఒంటిపై కారం చల్లి చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.