- ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న కామారెడ్డి జిల్లా పోలీసులు
- ఐదు నాటు తుపాకులు, ఎయిర్‌గన్ స్వాధీనం
కామారెడ్డి, వెలుగు : నాటు తుపాకులతో అటవీ జంతువులను వేటాడుతున్న ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం మీడియాకు వెల్లడించారు. బుధవారం రాత్రి గాంధారి పోలీస్‌స్టేషన్‌పరిధిలోని మొండి సడక్చౌరస్తా వద్ద ఎస్సై మహేందర్ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంల రెండు బైక్ లపై వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పట్టుకొని తనిఖీ చేయగా... నాటు తుపాకులు, గన్ పౌడర్, పొటాష్, స్టీల్పెలెట్స్(చెర్రలు) దొరికాయి.
అదుపులోకి తీసుకొని విచారించగా... జంతువులను వేటాడేందుకు గాంధారి మండలంలోని పారెస్ట్ ఏరియాకు వెళ్లగా వర్షం పడడంతో తిరిగి వస్తున్నట్లు తేలింది. పట్టుబడిన ఐదుగురు మూడు నెలల కింద బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన అస్లాం చావుస్వద్ద రూ. 10 వేలకు నాటు తుపాకి కొన్నట్లు తేలింది.
పూర్తి విచారణ జరిపిన అనంతరం గాంధారి మండలం గండివేట్ తండాకు చెందిన విస్లావత్అరుణ్, విస్లావత్ గోపీచంద్, అంగోత్లక్ష్మణ్, విస్లావత్ నాను, విస్లావత్గణేశ్, నస్రుల్లాబాద్మండలం హాజిపూర్ గ్రామానికి చెందిన సలావత్ చందర్, సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం నాగధార్ తండాకు చెందిన అంగోత్ ధర్మ నాయక్, బాన్సువాడ మండలం చిన్న రాంపూర్వాసి అస్లాంచావూస్ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఐదు నాటు తుపాకులు, ఎయిర్ గన్, చెర్రలు, గన్‌పౌడర్, పొటాష్, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సదాశివనగర్ సీఐ సంతోష్, ఎస్సైలు మహేందర్, నరేశ్ పాల్గొన్నారు.
