
- హుజూర్నగర్లో ఘటన
హుజూర్ నగర్, వెలుగు: భర్త చనిపోయాడని తెలిసి భార్య చనిపోయిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గెల్లి అప్పారావు(74) బుధవారం గుండెపోటుతో చనిపోయాడు. ఆయన కూతురు అమెరికా నుంచి వచ్చేంత వరకు ఈ విషయాన్ని అనారోగ్యంతో ఉన్న అతని భార్య అరుణ(70)కు తెలియనీయలేదు.
శుక్రవారం కూతురు రావడంతో గెల్లి అప్పారావు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. భర్త చనిపోయిన విషయాన్ని భార్యకు తెలియజేశారు. ఆ తరువాత అప్పారావు అంత్యక్రియలు పూర్తి చేశారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న అరుణ శనివారం ఉదయం చనిపోయారు. భర్త అంత్యక్రియలు చేసిన మరుసటి రోజే భార్య చనిపోవడంతో పట్టణంలో విషాదం
నెలకొంది.