ఏజెంట్ నుండి వైల్డ్ సాలా సాంగ్.. అఖిల్ మరీ ఇంత వైల్డా

ఏజెంట్ నుండి వైల్డ్ సాలా సాంగ్.. అఖిల్ మరీ ఇంత వైల్డా

అక్కినేనివారి వారసుడు అఖిల్ అక్కునేని(Akhil akkineni)హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "ఏజంట్"(Agent). స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar reddy) తెరకెక్కిస్తున్నాడు. అఖిల్ కెరిర్ లోనే భారీ బడ్జెట్ తో రానున్న ఈ మూవీలో మళయాల స్టార్ హీరో మమ్ముట్టి(Mammooty)కీలక పాత్రలో నటిస్తున్నాడు. అందుకే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్, టీజర్,ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రం నుండి వైల్డ్ సాల సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో (Bheems) కంపోజ్ చేశాడు. ఈ పాట కూడా ఆడియన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటోంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. కెరిర్ ఇప్పటివరకు ఒక్క కమర్శియల్ సక్సెస్ కూడా లేని అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా మాస్ హీరోగా సెట్ ఐపోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం.. సిక్స్ ప్యాక్ కూడా చేసాడు. ఇక అఖిల్ మునుపెన్నడూ కనిపించని గెటప్ లో స్టైలీష్ లుక్ లో కనిపిస్తుండటంతో ఈ మూవీ కోసం అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.