పుదుచ్చేరిలో కాంగ్రెస్ ను గెలిపిస్తే.. డ్రగ్స్మాఫియాను అణచివేస్తం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ను గెలిపిస్తే.. డ్రగ్స్మాఫియాను అణచివేస్తం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     అక్కడి ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: పుదుచ్చేరిలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, కాంగ్రెస్​ను గెలిపిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పుదుచ్చేరిలోని ఏంబులంలో ఆయన  పాదయాత్ర చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పుదుచ్చేరిలోని డ్రగ్స్​మాఫియా మొత్తం దేశానికి రూ.10 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను సరఫరా చేస్తోందని ఆరోపించారు. 

తెలంగాణలో తాము ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, ఇక్కడా చేస్తామన్నారు. దేశం కోసం కాంగ్రెస్ నేతలు ప్రాణత్యాగాలు చేస్తే.. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పని చేస్తోందని మండిపడ్డారు. పుదుచ్చేరి పీసీసీ చీఫ్ వైద్య లింగం, మాజీ సీఎం నారాయణ స్వామి, సీఎల్పీ నేత స్వామినాథం తదితరులు పాల్గొన్నారు.