ఆర్చర్ల గురి కుదురుతుందా? ఇవాళ్టి నుంచి (జులై 08) ఆర్చరీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌4

ఆర్చర్ల గురి కుదురుతుందా? 	ఇవాళ్టి నుంచి (జులై 08) ఆర్చరీ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌4

బరిలో నలుగురు కొత్త ఆర్చర్లు


మాడ్రిడ్‌‌‌‌‌‌‌‌: ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ సన్నాహాల్లో భాగంగా.. ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఆర్చర్లు వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌–4కు రెడీ అయ్యారు. మంగళవారం నుంచి జరిగే పోటీల్లో వీలైనన్ని పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుభవజ్ఞులైన జ్యోతి సురేఖ, తరుణ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌, దీపికా కుమారితో పాటు నలుగురు కొత్త ఆర్చర్లు బరిలోకి దిగుతున్నారు. 

ఇదే జట్టు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 5 నుంచి 12 వరకు కొరియాలోని గ్వాంగ్జూలో జరిగే వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో 2023 బెర్లిన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో సాధించిన మూడు టైటిల్స్‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ఒజాస్‌‌‌‌‌‌‌‌ దియోతలే, ఆదితి స్వామి, కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ ఆర్చర్‌‌‌‌‌‌‌‌ అభిషేక్‌‌‌‌‌‌‌‌ వర్మ, మధుర ట్రయల్స్‌‌‌‌‌‌‌‌లో ఫెయిల్‌‌‌‌‌‌‌‌ కావడం కాస్త నిరాశపర్చే అంశం. మూడుసార్లు ఒలింపియన్‌‌‌‌‌‌‌‌ అటాను దాస్‌‌‌‌‌‌‌‌ కూడా అర్హత సాధించలేకపోయాడు. వీళ్ల ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు టీనేజర్లు సహా నలుగురు ప్లేయర్లు అరంగేట్రం చేస్తున్నారు. 

మహారాష్ట్ర ఆర్చర్లు గథా ఖడ్కే (15), శార్వరి షెండే (16), దీపిక, అంకితా భాకట్‌‌‌‌‌‌‌‌తో కలిసి రికర్వ్‌‌‌‌‌‌‌‌లో పోటీపడనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 336 మంచి ఆర్చర్లు ఈ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ రికర్వ్‌‌‌‌‌‌‌‌లో బొమ్మదేవర ధీరజ్‌‌‌‌‌‌‌‌, నీరజ్‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌, తరుణ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌ బరిలో ఉన్నారు. రాహుల్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (20) సీనియర్‌‌‌‌‌‌‌‌ విభాగంలో అరంగేట్రం చేయనున్నాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌  కేటగిరీలో అమన్‌‌‌‌‌‌‌‌ సైనీ, ప్రథమేశ్‌‌‌‌‌‌‌‌ పుగే, రిషబ్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, ప్రియాన్షు, విమెన్స్‌‌‌‌‌‌‌‌లో ప్రీతికా (16), జ్యోతి సురేఖ, పర్ణీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ పోటీ పడనున్నారు.