
కెప్టెన్‌గా రాహుల్, కోచ్‌గా కుంబ్లేపై భారీ అంచనాలు
క్రిస్ గేల్‌పై అందరి దృష్టి
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ మొదలవుతుందంటే.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై కూడా చర్చ బాగానే నడుస్తుంది. ఎందుకంటే టీమ్‌లో ఉండే స్టార్ ప్లేయర్ల వల్ల అంచనాలు కూడా బాగానే ఉంటాయి. కానీ వాటిని అందుకోవడంలోనే ప్రతిసారి విఫలమవుతూనే ఉంది. గత రెండు సీజన్లను టాప్ గేర్‌లో మొదలుపెట్టినా.. పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్‌తోనే లీగ్‌ను ముగించింది. ఒకరిద్దరు స్టార్ ప్లేయర్ల మీద జట్టు ఆధారపడటం పంజాబ్‌కు ఉన్న అతిపెద్ద బలహీనత. అయితే 2020 వేలంలో దాదాపు అన్ని సమస్యలను పరిష్కరించుకుని ఈసారి లీగ్‌కు సరికొత్తగా రెడీ అవుతున్నది. ఫారిన్ క్రికెటర్లతో పాటు డొమెస్టిక్ లెవెల్లో ఓ స్థాయిలో ఆడిన ఇండియన్ యంగ్‌స్టర్స్‌తో టీమ్‌ను పటిష్టం చేసుకుంది. లాస్ట్ సీజన్లలో కెప్టెన్‌గా ఉన్న స్పిన్నర్ అశ్విన్‌ను పూర్తిగా వదిలేసి.. టీమిండియా టాప్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌కు సారథ్యం అప్పగించింది. కోచింగ్ స్టాఫ్ విషయంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇండియన్ మాస్టర్ బ్రెయిన్ ఆఫ్ క్రికెట్ అనిల్ కుంబ్లేను చీఫ్ కోచ్‌గా తీసుకుంది. దీంతో ఈ కర్ణాటక కాంబో కచ్చితంగా అద్భుతాలు చేస్తారని ఫ్రాంచైజీ నమ్ముతోంది. టాప్ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు కాబట్టి ప్లే ఆఫ్‌కు చాన్స్ ఉంది. ఈనెల 20న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో పంజాబ్.. ఐపీఎల్ జర్నీని మొదలుపెడుతుంది.
బలం..
పేపరు మీద పేరు చూస్తే పంజాబ్‌కు తిరుగులేదని అనిపిస్తుంది. బ్యాటింగ్‌లో రాహుల్, క్రిస్ గేల్, మ్యాక్స్‌వెల్.. ధనాధన్ క్రికెట్‌కు అతికినట్లు సరిపోతారు. వీళ్లలో ఏ ఇద్దరు కుదురుకున్నా.. ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా డేంజరస్ గేల్ ఈసారి మరింత కసితో కనిపిస్తున్నాడు. కెప్టెన్‌గా ఎక్స్‌ట్రా ఒత్తిడి ఉన్నా.. రాహుల్ ఫామ్‌కు వచ్చిన ఇబ్బందేమి లేదు. నికోలస్ పూరన్, మయాంక్ అగర్వాల్‌తో టాపార్డర్ మరింత బలంగా కనిపిస్తోంది. పది ఓవర్లు వీళ్లు చూసుకుంటే తర్వాత మ్యాక్స్‌వెల్, నీషమ్ ఉండనే ఉన్నారు. మ్యాక్సీ ఆల్‌రౌండర్‌గా కీలకం కానున్నాడు. ఇక బౌలింగ్‌లో షమీ, షెల్డన్ కాట్రెల్ ప్రధాన ఆయుధాలు. ఓపెనింగ్, డెత్ ఓవర్లలో వీరిద్దరే చా లా ముఖ్యం. డొమెస్టిక్ సీజన్‌లో అదరగొట్టిన ఇషాన్ పోరెల్‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే టాలెంటెడ్ప్లేయర్లు ఎక్కువగా ఉండటంతో ఎవర్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకుంటారన్నదే ప్రధానాంశం.
బలహీనత..
వ్యక్తిగతంగా ప్రతి ప్లేయర్ స్టార్‌గా కనిపిస్తున్నా.. సమష్టిగా రాణించడంలోనే పంజాబ్ విఫలమవుతున్నది. పరస్పరం సపోర్ట్ ఇచ్చుకోలేక.. కీలక సమయంలో ప్లేయర్లు తడబడుతున్నారు. ఇది అతిపెద్ద బలహీనతగా మారింది. కరుణ్ నాయర్, మన్‌దీప్, దీపక్ హుడా, కృష్ణప్ప గౌతమ్ వంటి సీనియర్లు ఉన్నా నమ్మకం ఉంచలేని పరిస్థితి. బౌలింగ్‌లో షమీ, కొట్రెల్‌కు అండగా నిలిచే వారు లేకపోవడం లోటు. భారీగా వెచ్చించి తెచ్చుకున్న రవి బిష్ణోయ్ ఏం చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మ్యాక్సీ వచ్చే వరకు మిడిలార్డర్‌ను నడిపించే వారు ఎవరనేది కూడా తేలాలి.
అంచన..
వరల్డ్ క్లాస్ ప్లేయర్లందరూ అంచనాలను అందుకుంటే పంజాబ్‌ను కచ్చితంగా ప్లే ఆఫ్స్‌లో చూడొచ్చు. అయితే వీళ్లకు యంగ్‌స్టర్స్ కూడా తోడుగా నిలవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమవుతుందా? అన్నదే ప్రశ్న.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్
బ్యాట్స్‌మెన్: రాహుల్ (కెప్టెన్), క్రిస్ గేల్, కరుణ్ నాయర్, మన్‌దీప్ సింగ్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్
ఆల్‌రౌండర్స్: దీపక్ హుడా, మ్యాక్స్‌వెల్, జేమ్స్ నీషమ్, కృష్ణప్ప గౌతమ్, తజిందర్ సింగ్
వికెట్ కీపర్స్: నికోలస్ పూరన్, ప్రభ్‌సిమ్రన్‌సింగ్
బౌలర్లు: అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్, దర్శన్ నల్కాండే, హర్డస్ విల్జోన్, హర్‌ప్రీత్ బ్రార్, ఇషాన్ పోరెల్, షమీ, జగదీశ సుచిత్, ముజిబుర్ రెహమాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, షెల్డన్ కాట్రెల్.