జొకోవిచ్‌‌‌‌‌‌‌‌కు ఎదురుందా?..

జొకోవిచ్‌‌‌‌‌‌‌‌కు ఎదురుందా?..
  •     రా. 6.30 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో

వింబుల్డన్‌‌‌‌‌‌‌‌: కెరీర్‌‌‌‌‌‌‌‌లో 24వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ వేటలో ఉన్న సెర్బియా స్టార్‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ వింబుల్డన్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యాడు. ఆదివారం జరిగే ఈ మెగా పోరులో యంగ్‌‌‌‌‌‌‌‌ టాలెంట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ కార్లోస్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌‌‌‌‌)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇద్దరు టాప్​ సీడ్​ల మధ్య పోరు కవడంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌‌‌‌‌ను అంచనా వేయడం కష్టంగా మారింది. అయితే,గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ టోర్నీల్లో ఎంతో అనుభవం ఉన్న జొకోకు అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ ఎలాంటి పోటీ ఇస్తాడన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత నెలలో ముగిసిన ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ను ఓడించిన జొకో  టైటిల్‌‌‌‌‌‌‌‌ నెగ్గాడు. గణాంకాలు కూడా జొకోవిచ్‌‌‌‌‌‌‌‌కే అనుకూలంగా ఉన్నాయి. అయితే గతేడాది యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచిన అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ రెండో మేజర్‌‌‌‌‌‌‌‌ టైటిల్​తో సంచలనం సృష్టించాలని 
టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నాడు.