ఈ మూడు జిల్లాల్లో 48 గంటలు పాటు వైన్ షాపులు బంద్

ఈ మూడు జిల్లాల్లో 48 గంటలు పాటు వైన్ షాపులు బంద్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలింగ్ జరగనున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో బంద్ కానున్నాయి.   2024 మే 25 సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి అంటే మే 27 సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయనున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికలు జరగని ప్రాంతంలో మాత్రం మద్యం దుకాణాలు తీసి ఉంటాయి.  

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.కాగా మే 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మరోవైపు జూన్ 4వ తేదీన కూడా తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

 మే 27వ తేదీ సోమవారం రోజున  జరిగే  పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు  చేశారు.  ఉదయం 8గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ రోజు ఉదయం6 నుండి సాయంత్రం 8 వరకు144 సెక్షన్ అమలు ఉంటుంది. ఇక మూడు జిల్లాల్లో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.  

మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో మొత్తం 4 లక్షల 61 వేల 806 గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 73వేల 406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 23వేల 985 మంది  గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా..  ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షా 66వేల 448 మంది  గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.