ఘట్‌కేసర్, వెలుగు: పోచారం ఐటీ కారిడార్ పీఎస్పరిధిలోని యానంపేట్దగ్గర ఉన్న శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలోని చెట్ల పొదల్లో శుక్రవారం కుళ్లిన స్థితిలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. దుర్వాసన వస్తుండడంతో వర్సిటీ సిబ్బంది వెళ్లి చూడగా డెడ్‌బాడీ కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. మృతురాలి మెడ భాగంలో కొన్ని గాట్లు గుర్తించారు. దీన్ని బట్టి ఆమెకు ఉరి వేయడం లేదా గొంతు నులమడం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
కత్తిపోటు కూడా అయి ఉండవచ్చని అనుకుంటున్నారు. అతకుముందు లైంగిక దాడి చేసి చంపి అక్కడ పడేసి ఉంటారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు నైట్డ్రస్వేసుకుని ఉంది. పింక్ కలర్ ప్యాంటు టీషర్టుగా గుర్తించారు. వయసు 30 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండొచ్చని, వారం క్రితమే మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం కోసం గాంధీకి తరలించారు. ఇటీవల కాలంలో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా ఆమె వివరాలను కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
