V6 News

పురుషుల మ్యాచ్ కు అంపైర్ గా మహిళ ‌‌‌‌

పురుషుల మ్యాచ్ కు అంపైర్ గా మహిళ ‌‌‌‌
క్రికెట్ హిస్టరీలో ఫస్ట్​ టైమ్​ సిడ్నీ: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టెస్ట్‌‌‌‌లో అరుదైన రికార్డుకు వేదిక కానుంది. ఆసీస్‌‌‌‌కు చెందిన క్లైర్‌‌‌‌ పోలోసాక్‌‌‌‌.. మ్యాచ్‌‌‌‌ అఫీషియల్‌‌‌‌గా వ్యవహరించనుంది. దీంతో మెన్స్‌‌‌‌ టెస్టు క్రికెట్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ ఫిమేల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ అఫీషియల్‌‌‌‌గా ఆమె రికార్డులకెక్కనుంది. థర్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో పోలోసాక్‌‌‌‌.. ఫోర్త్‌‌‌‌ అంపైర్‌‌‌‌గా బాధ్యతలను నిర్వర్తించనుంది. న్యూసౌత్‌‌‌‌వేల్స్‌‌‌‌కు చెందిన 32 ఏళ్ల పోలోసాక్‌‌‌‌.. ఇప్పటికే మెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో ఆన్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ అంపైర్‌‌‌‌గా వ్యవహరించింది. 2019లో ఐసీసీ డివిజన్–2 లీగ్‌‌‌‌లో నమీబియా, ఒమన్‌‌‌‌ మధ్య జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఆమె అంపైరింగ్​ చేసింది. ఫ్యాన్స్‌‌‌‌కు మాస్క్‌‌‌‌లు తప్పనిసరి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. థర్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు హాజరయ్యే ఫ్యాన్స్​కు  స్ట్రిక్ట్‌‌‌‌ రూల్స్‌‌‌‌ పెట్టారు. స్టేడియానికి వచ్చే ప్రతి ప్రేక్షకుడు మాస్క్‌‌‌‌ ధరించాల్సిందేనని న్యూసౌత్‌‌‌‌వేల్స్‌‌‌‌ హెల్త్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ హజార్డ్‌‌‌‌ వెల్లడించారు. ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్