పైసలిచ్చేదాకా డెడ్ బాడీ ఇయ్యలె..

పైసలిచ్చేదాకా డెడ్ బాడీ ఇయ్యలె..

సికింద్రాబాద్,వెలుగు: పైసలిచ్చే దాకా తన కొడుకు శవాన్ని ఇయ్యలేదంటూ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ యాజమాన్యంపై రేణుక అనే మహిళ శనివారం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ పోలీసులను అభ్యర్థించారు. తన కుమారుడు స్టీవెన్ రాజ్ కు హెల్త్ బాగాలేకపోవటంతో ఇటీవల యశోద లో చేర్పించామని, ట్రీట్ మెంట్ పేరుతో దాదాపు రూ. 20 లక్షలు బిల్లు వేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇన్సూరెన్స్ ద్వారా రూ. 12 లక్షలు చెల్లించినప్పటికీ, మిగతా డబ్బులు కట్టాల్సిం దేనంటూ రెండ్రోజుల పాటు డెడ్ బాడీని ఇవ్వలేదన్నా రు. ఈ నెల 12 తన కొడుకు చనిపోయాడని చెప్పారని, అప్పటికే రెండ్రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉంచుకొని మిగతా రూ. 8 లక్షలు ఇవ్వాల్సిం దేనని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి స్టీవెన్ రాజ్ పనిచేసిన కంపెనీ నుంచి వచ్చిన రూ. 4 లక్షలు తీసుకున్నారని.. మొత్తంగా రూ. 16 లక్షలు వసూలు చేశారని రేణుకా చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఈటల, హరీష్ రావు తమకు న్యా యం చేయాలంటూ మృతుడి తల్లి, సోదరి రిక్వెస్ట్ చేశారు.

సైంటిస్టులు ఓకే అనగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్