రోడ్డు పక్కనే మహిళ డెలివరీ

రోడ్డు పక్కనే మహిళ డెలివరీ

ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులతో రోడ్డు పక్కనే డెలివరీ అయ్యింది.ఈ ఘటన హైదరాబాద్ బాపుఘాట్ దగ్గర జరిగింది. కవిత అనే మహిళ తన తల్లితో ఆస్పత్రికి వెళ్తుండగా పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చేసరికి కవిత రోడ్డు పక్కన రక్తస్రావంతో పడి ఉంది. దీంతో అప్పటికప్పుడు సిబ్బంది రోడ్డు పక్కనే ఆమెకు డెలివరి చేశారు. కవిత మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కార్వాన్ ప్రభత్వ ఆస్పత్రిలో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.