జూబ్లీహిల్స్, వెలుగు: వంట చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు అంటుకోవడంతో ఓ మహిళ మృతి చెందింది. రెహమత్ నగర్ కమాన్ గల్లీలో నివాసముండే సోను(40) ఆదివారం ఇంట్లో వంట చేస్తోంది. ఆ సమయంలో ఒక్కసారిగా రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీకై ఆమెకు మంటలు చెలరేగాయి.
ఆ మంటల్లో చిక్కుకుని సోను మృతిచెందింది. పక్కనే ఉన్న తల్లిదండ్రులు గోపాల్‌సింగ్, లలితాసింగ్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకుని సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆర్పి వేశారు.
