గచ్చిబౌలి, వెలుగు:టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి ఉన్న తన ఫొటోలు, వీడియోలను కొందరు అసభ్యకరంగా డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఓ మహిళ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్ఠను భంగం కలిగించేలా ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల నుంచి కొంతమంది వ్యక్తులు ఈ కుట్రకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
దేశాభిమాని, ది న్యూస్ తెలుగు, టీమ్ ప్రశ్న, వైఎస్జే షాఫి వంటి పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ అభ్యంతరకర కంటెంట్‌ను సర్క్యులేట్ చేస్తున్నారన్నారు. దీనివల్ల తన కుటుంబం తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతోందని ఆమె తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
