ఢిల్లీలో కలకలం.. నిర్భయ తరహాలో ఓ ఘటన జరిగింది. ఓ స్లీపర్ బస్సులో.. బస్సులోనే మహిళపై డ్రైవర్, కండెక్టర్ అత్యాచారం చేశారు. ఆ మహిళ కంప్లయింట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. బస్సును పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. పోలీసుల అదుపులో బస్సు డ్రైవర్, కండెక్టర్ ఉన్నారా లేదా అనేది ఇంకా వెల్లడించకపోవటం కలకలం రేపుతోంది.
13 ఏళ్ల క్రితం ఢిల్లీలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో యువతిపై అత్యాచారం చేయటం దేశాన్ని కుదిపేసింది.. ఇప్పుడు అలాంటి తరహాలోనే ఓ స్లీపర్ బస్సులో.. మహిళపై ఆ బస్సు డ్రైవర్, కండెక్టర్ అత్యాచారం చేయటం.. కేసు నమోదు కావటం సంచలనంగా మారింది.
కదులుతున్న స్లీపర్ బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని బలవంతంగా లోపలి లాక్కెళ్లి అత్యాచారం చేశారు నిందితులు. బాధితురాలు ముగ్గురు పిల్లల తల్లి అని తెలుస్తోంది. మే 12న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి బస్సును సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ఘటన జరిగిన బస్సుకు నిబంధనలకు విరుద్ధంగా టింటెడ్ కిటికీలు ఉన్నాయని తెలిపారు పోలీసులు.
బాధితురాలు పీతంపురంలో మంగోలప్పురిలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు తెలిపింది. మే 11న బాధితురాలు ఇంటికి వస్తుండగా... సరస్వతి విహార్ లోని బస్టాప్ దగ్గర స్లీపర్ బస్సు దగ్గర నిలబడి ఉన్న నిందితుడు ఆమెను టైం ఎంత అని అడిగి..బస్సులోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది.
ఘటన జరిగిన సమయంలో బస్సులో ఇతర ప్రయాణికులు ఉన్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బాధితురాలు, నిందితుల వివరాలు పోలీసులు వెల్లడించలేదు.
