మేడారం జాతరలో ’ జంపన్న’ పుట్టాడు

మేడారం జాతరలో ’ జంపన్న’ పుట్టాడు

గిరిజన జాతర మేడారంలో  ఓ మహిళ డెలివరీ అయ్యింది. సమ్మక్క, సారలమ్మఆశీర్వాదంతో పడంటి బాబుకు జన్మనిచ్చింది. పుణే కు చెందిన ఆ మహిళ మేడారం జాతరను చూసేందుకు వచ్చింది. పుట్టిన బాబుకు జంపన్నగా పేరు పెట్టారు వారి కుటుంబ సభ్యులు. మేడారంలో బాబు పుట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రభుత్వం తరపునుంచి కేసీఆర్ కిట్ ను అందజేశారు  మంత్రి  ఈటల రాజేందర్.