కేబుల్ బ్రిడ్జిపై సూసైడ్ కు యువతి యత్నం

కేబుల్ బ్రిడ్జిపై సూసైడ్ కు యువతి యత్నం

మాదాపూర్, వెలుగు: ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి కేబుల్ బ్రిడ్జి పై నుంచి దుర్గం చెరువులోకి దూకేందుకు యత్నించింది. మాదాపూర్​ట్రాఫిక్​పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆమెను ప్రాణాలతో కాపాడారు. 

పోలీసులు తెలిపిన ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం12.51 గంటల సమయంలో ఓ యువతి(25) దుర్గం చెరువు పైనున్న కేబుల్​బ్రిడ్జి ఫుట్​పాత్​పై చేరుకుంది. బ్రిడ్జిపైకి ఎక్కి చెరువులోకి దూకి సూసైడ్​ చేసుకునే ప్రయత్నించింది. అక్కడే ఉన్న ట్రాఫిక్​ పోలీసులు చూసి వెంటనే ఆమెను కిందకు దించి కాపాడారు. అంతకుముందే ఆ యువతి గుర్తు తెలియని ట్యాబ్లెట్స్​వేసుకోవడంతో చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.