ఎంగేజ్‌మెంట్ ఒకరితో..పెళ్లి మరొకరితో..

ఎంగేజ్‌మెంట్ ఒకరితో..పెళ్లి మరొకరితో..

తనతో ఎంగేజ్మెంట్ అయ్యాక మరొకరిని పెళ్లి చేసుకున్నాడని..సీఎం కాన్వాయ్ డ్రైవర్ కానిస్టేబుల్ శశికుమార్ పై ఓ బాధితురాలు  రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ జియగూడకు చెందిన అఖిలతో, వనపర్తి జిల్లా పెద్ద మందడి గ్రామానికి చెందిన వాకిటి శశికుమార్ తో పెళ్లి ఫిక్స్ అయింది. 2019 నవంబర్ లో వీరికి ఎంగేజ్మెంట్ జరిగింది. మొదట 5 లక్షలు కట్నం ఒప్పందం చేసుకున్నారని.. ఎంగేజ్మెంట్ అనంతరం 10 లక్షల కట్నం, 20 తులాల బంగారం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని శశి కుమార్ డిమాండ్ చేసినట్లు బాధితురాలు  కమిషన్ కు వివరించింది. శశికుమార్ కేసీఆర్ కాన్వాయ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. సీఎం శశికుమార్ 2021ఆగస్ట్ 26న మరో అమ్మాయితో పెళ్ళి చేసుకుని తనకు అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. శశికుమార్ పై ఇప్పటికే కులసంపుర, పెద్ద మందడి, నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని తెలిపింది. రెండు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నా న్యాయం జరగడం లేదని..తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలి కుటుంబం హెచ్ఆర్సీని కోరింది.