V6 News

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడమే లక్ష్యం : డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడమే లక్ష్యం :  డిప్యూటీ మేయర్  యాదగిరి సునీల్ రావు
  •     డిప్యూటీ మేయర్  యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే పీఎం నరేంద్రమోదీ లక్ష్యమని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. సోమవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళాభారతిలో మహిళాసంఘ సభ్యులకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సునీల్‌‌‌‌‌‌‌‌ రావు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పథకం ద్వారా అనేక రాయితీలు కల్పిస్తోందన్నారు. సమావేశంలో  కార్పొరేటర్ బండారి వేణు, మాజీ కార్పొరేటర్ సాదవేని శ్రీనివాస్, మెప్మా పీడీ స్వరూపరాణి, మహిళాసంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.