V6 News

విమెన్స్‌‌ క్యాండిడేట్స్‌‌ చెస్‌‌ టోర్నీ: వైశాలి 13వ గేమ్ డ్రా..

విమెన్స్‌‌ క్యాండిడేట్స్‌‌ చెస్‌‌ టోర్నీ: వైశాలి 13వ గేమ్ డ్రా..

పాఫోస్‌‌ (సైప్రస్‌‌): ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఆర్‌‌. వైశాలి.. విమెన్స్‌‌ క్యాండిడేట్స్‌‌ చెస్‌‌ టోర్నీలో టైటిల్‌‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. జాంగ్‌‌యి టాన్‌‌ (చైనా)తో మంగళవారం జరిగిన కీలకమైన 13వ రౌండ్‌‌ గేమ్‌‌ను వైశాలి34 ఎత్తుల వద్ద  డ్రా చేసుకుంది.  ప్రస్తుతం వైశాలి ఏడున్నర పాయింట్లతో సంయుక్తంగా టాప్‌‌ ప్లేస్‌‌లో కొనసాగుతోంది. 

అయితే వైశాలికి దీటుగా పోటీ ఇస్తున్న జు జినెర్‌‌.. అలెగ్జాండ్రా గొరియాచికినాతో జరిగిన గేమ్‌‌లో 57 ఎత్తుల వద్ద ఓటమిపాలైంది. ఫలితంగా జినెర్‌‌ 7 పాయింట్లతో మూడో ప్లేస్‌‌కు పడిపోయింది.  అన్నా ముజిచుక్‌‌పై 44 ఎత్తుల వద్ద నెగ్గిన బిబిసారా అసబయోవా 7.5 పాయింట్లతో వైశాలితో టైటిల్‌‌ కోసం పోటీపడుతోంది.

 కేథరీనా లాగ్నో (రష్యా)తో జరిగిన గేమ్‌‌లో దివ్య దేశ్‌‌ముఖ్‌‌ (5 పాయింట్లు) 37 ఎత్తుల వద్ద ఓడింది. ఓపెన్‌‌ సెక్షన్‌‌లో టైటిల్‌‌కు దూరమైన ఆర్‌‌. ప్రజ్ఞానంద(5.5)..  ఫ్యాబియానో కరువానతో జరిగిన గేమ్‌‌ను 43 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు.