- గోల్డ్‌కు 18 శాతం మంది, ఎఫ్‌డీలకు 13 శాతం ఓటు
- స్టాక్స్‌కు తగ్గిన ఆదరణ
- అనరాక్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టడానికి మహిళలు మొగ్గు చూపుతున్నారు. రెసిడెన్షియల్ సెగ్మెంట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ సర్వే ప్రకారం, -71శాతం మంది మహిళలు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌ను ప్రైమరీ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఎంచుకున్నారు. గోల్డ్‌కు 18 శాతం మంది, ఎఫ్‌డీలకు 13 శాతం మంది ఓటేశారు. - స్టాక్ మార్కెట్‌లో మహిళల పెట్టుబడులు తగ్గిపోయాయి.
స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి 2019 లో 20 శాతం మంది ఆసక్తి చూపించగా, ప్రస్తుతం ఈ నెంబర్ 3 శాతానికి పడిపోయింది. లగ్జరీ ఇండ్లను కొనడానికి మహిళలు ప్రాధాన్యం ఇస్తున్నారు. 61శాతం మంది మహిళలు రూ.90 లక్షల కంటే ఎక్కువ విలువున్న ఇండ్లను కొనడానికి ఆసక్తి చూపించారు. - 37శాతం మంది రూ.90 లక్షలు–రూ.1.5 కోట్ల మధ్య, - 14శాతం మంది రూ.1.5–రూ.2.5 కోట్ల మధ్య, 10 శాతం మంది రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ విలువున్న ఇండ్లను కొనడానికి మొగ్గు చూపారు.
“ మోడర్న్ వుమెన్ ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ కంటే రియల్ ఎస్టేట్‌ను ఎంచుకుంటున్నారు. సంపద పెంచుకోవడానికి రియల్ ఎస్టేట్ బెటర్ అని భావిస్తున్నారు. పొదుపు చేయడం కంటే లాంగ్-టర్మ్‌లో సంపద పెంచే అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు” అనరాక్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ అన్నారు. కాగా, అనరాక్ 9,600 మందితో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 50 శాతం మంది మహిళలు పాల్గొన్నారు. వీరి ఆలోచన విధానాలను సర్వే వెల్లడించింది.
తొందరగా ఇన్వెస్ట్ చేస్తూ..
దీర్ఘకాలంలో సంపద పెంచే అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మహిళలు ఆసక్తిగా ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్‌లో తొందగా పెట్టుబడులు మొదలు పెడుతున్నారు. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తుండడంతో పాటు అధిక విలువుండే పెట్టుబడుల నిర్ణయాలను తీసుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టింది. మ్యూచువల్ ఫండ్స్‌పై అవగాహన పెంచుతోంది.
గ్యాప్ తగ్గుతోంది..
ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి మహిళల పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్యాప్ తగ్గుతోంది. అవగాహన పెరుగుతుండడం, స్టాక్స్, బాండ్స్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ అసెట్స్ ఈజీగా అందుబాటులో ఉండడం ఇందుకు కారణం. “ మహిళలు త్వరగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్రమశిక్షణ పాటిస్తున్నారు.
తమ ఫైనాన్షియల్ ఫ్యూచర్‌ను మార్చుకుంటున్నారు” అని ఎడెల్వీస్ ఎండీ రాధికా గుప్తా అన్నారు. మహిళలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని, దీర్ఘకాలంలో సంపద పెంచుకోవాలని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ తన డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ప్రోత్సహిస్తోంది.
