జగిత్యాలలో మహిళల భారీ బైక్ ర్యాలీ

జగిత్యాలలో మహిళల భారీ బైక్ ర్యాలీ

జగిత్యాల టౌన్, వెలుగు: భారతీయ సంస్కృతి, మరుగున పడుతున్న కుటుంబ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్  శత జయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం జగిత్యాల పట్టణ హిందూ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహిళా చైతన్య బైక్  ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన భారతీయ జీవన విధానాన్ని భావితరాలకు అందించాలని కోరారు. మహిళలు సంఘటితంగా ఉంటూ, హిందూ విలువల ఆధారంగా కుటుంబాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. జ్యోత్స్న, కవోష్ణ, స్వప్న, స్రవంతి, సునీత, అశ్విని, భారతి, దీప, మధురిమ, సుజాత, కౌన్సిలర్  అరవ లక్ష్మి పాల్గొన్నారు.