
ఆర్టీసీ సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు 8 రోజుల్లోగా ఉద్యోగాలిచ్చి, రెండు లక్షల ఎక్స్‌గ్రేషియాను కూడా చెల్లిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్ లో కార్మికులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ… ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీఎంబర్స్ మెంటు కల్పిస్తామని, అదేవిధంగా వారి కోసం గృహ నిర్మాణ పథకానికి రూపకల్పన చేస్తామని అన్నారు. సంస్థ లాభాల బాటలో నడవాలంటే ఆర్టీసీలో పార్శిల్ సర్వీసులను కూడా ప్రారంభించాలని సీఎం సూచించారు. ప్రయాణికులతో బస్సు నిండిన తర్వాతనే సర్వీసును ప్రారంభించాలని, ప్రయాణీకుడు చేయి ఎత్తిన ప్రతీ చోట బస్సు ఆపాలని అన్నారు. బస్సుల్లో ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే ఇప్పటి వరకు కండక్టర్‌కు విధిస్తున్న జరిమానాను ఇకపై ప్రయాణికులకే విధించాలని సీఎం ఈ సమావేశంలో నిర్ణయించారు.