పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ దవాఖానలో గురువారం ఆధునిక రక్త శుద్ధి ప్రక్రియలపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రక్త సేకరణ, శుద్ధి, రక్త నమూనాల ద్వారా వివిధ వ్యాధులను గుర్తించే అంశాలపై నిపుణులు చర్చించారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రక్తంలోని తెల్ల రక్తకణాలను వేరు చేసి, ఆరోగ్యవంతమైన రక్తాన్ని తిరిగి రోగి శరీరంలోకి ఎక్కించే ప్రక్రియను ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా వివరించారు. కార్యక్రమంలో నిమ్స్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ కుమార్ వుజ్జిని, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ బి. శాంతి, డాక్టర్ మహేశ్ కుమార్, డాక్టర్ మురళీకృష్ణ
తదితరులు పాల్గొన్నారు.
