ఎమోజీ డే: అంద‌రూ ఎక్కువ‌గా వాడేవి ఏంటో తెలుసా?

ఎమోజీ డే: అంద‌రూ ఎక్కువ‌గా వాడేవి ఏంటో తెలుసా?

మనిషి హావభావాలు చెప్పాలంటే ముఖాన్ని కష్ట పెట్టనవసరం లేదు.  చేతితో తెగ హైరానా పడనవసరం లేదు. మనసులో ఏ భావం ఉన్నా ఎదుటి వ్యక్తికి స్మార్ట్​ ఫోన్​లో ఓ చిన్న ఎమోజీ పంపితే చాలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఎదుటి వ్యక్తులు ఈజీగా అర్థం చేసుకుంటారు. అంతలా చెరగని ముద్ర వేశాయి ఎమోజీలు. ఎమోజి అనేది రెండు జపనీస్ పదాల కలయిక. దీని మీనింగ్​ చిత్రం, అక్షరం.  ఇవి జపాన్​లో పుట్టినట్లు సమాచారం.  అందువల్ల, చాలా ఎమోజీలు వాటి జపనీస్ అర్థంతో జతచేసి ఉంటాయి. ఎన్నడూ లేనిది ఈ ఎమోజీల సంగతి ఎందుకు చెబుతున్నామంటే జులై 17 ప్రపంచ ఎమోజీల డే అండీ.. సో అన్ని ఎమోజీల ఉద్దేశం మనకు తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి కొన్ని ఎమోజీల  గురించి ఇవాళ తెలుసుకుందాం. 

ముఖం మూసుకున్న కోతి ఎమోజీ

మనం ఎలా ఉపయోగిస్తాం: అయ్యో, బ్లషింగ్!
దీని అర్థం ఏంటి: నేను చెడును చూడలేదు. ఈ  కోతి 'చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు' అనే సామెతలో భాగంగా తన కళ్లను చేతులు కప్పుకుంది.

డ్యాన్స్ చేసే అమ్మాయిలు

మనం ఎలా ఉపయోగిస్తాం: అమ్మాయిల్లో ఉత్సాహాన్ని పెంచడానిక యూజ్​ చేస్తాం.
దీని అర్థం ఏమిటి: ఈ  కవల బాలికలు 'బన్నీ గర్ల్స్' లేదా 'ప్లేబాయ్ బన్నీస్' అనే జపనీస్ భావనను సూచిస్తారు.

డ్యాన్స్ అమ్మాయి

మనం ఎలా ఉపయోగిస్తాం: పార్టీ అని యూజ్​ చేస్తాం.
దీని అర్థం ఏమిటి: డాన్సర్

ప్రార్థిస్తున్న చేతులు లేదా హై-ఫై?

మనం ఎలా ఉపయోగిస్తాం:  మనం ఏదైనా జరుగుతుందని  ఆశించినప్పుడు,  ఈ ప్రార్థించే చేతులను ఉపయోగిస్తాం.
దీని అర్థం ఏమిటి: ఇద్దరు వ్యక్తులు పలకరించుకున్నప్పుడు ఇచ్చే హైఫైని సూచిస్తుంది.  వాస్తవానికి, ఇది క్షమాపణ అని అర్థం.

ఎరుపు రంగు రాక్షసుడు

మనం ఎలా ఉపయోగిస్తాం:  నేను విచిత్రంగా ఉన్నాను!
దీని అర్థం ఏమిటి: జపనీస్ ఓగ్రే, ఒక పురాణ రాక్షసుడు 

అమ్మాయి తలపై చేతులు

మనం ఎలా ఉపయోగిస్తాం: షాక్, ఇబ్బంది లేదా 'ఓ మై గాడ్' పరిస్థితిలో వ్యక్తీకరించడానికి.
దీని అర్థం ఏమిటి: అమ్మాయి తలపై చేతులు ఉన్నందున, ఆమె తనను తాను సర్ది చెప్పుకుందని అర్థం. జపనీయులు 'సరే' అని రాయాలనుకున్నప్పుడు ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తారు.

గాలి దెబ్బ

మనం ఎలా ఉపయోగిస్తాం: ఫుల్​ గాలి
దీని అర్థం ఏమిటి: వాహనాన్ని వేగంగా నడపడం

షూటింగ్​ స్టార్

మనం ఎలా ఉపయోగిస్తాం:  మ్యాజిక్​ని వ్యక్తీకరించడానికి దీనిని ఉపయోగిస్తాం.
దీని అర్థం ఏమిటి: ఇది నక్షత్రం కాదు.  మైకాన్ని సూచిస్తుంది.

అరచేతులు తెరవండి

మనం ఎలా ఉపయోగిస్తాం:   'స్టాప్ ఇట్' అని చెప్పాడానికి ఉపయోగిస్తాం.
దాని అర్థం ఏమిటి: జపనీస్ సంస్కృతిలో,  ఓపెన్ అరచేతులు కౌగిలిని సూచిస్తాయి.

కన్నీటి చుక్కతో ఉన్న మోహం

మనం ఎలా ఉపయోగిస్తాం:  విచారంగా ఉన్నామని, కన్నీళ్లు పెట్టగలమని వ్యక్తీకరించడానికి.
దీని అర్థం ఏమిటి: ఇది నిద్రపోయే ముఖం. ముఖం మీద కన్నీరు నిజానికి చినుకులు.