నూటికి 10 మంది కిడ్నీ బాధితులే :  డా. సంతోష్ కుమార్

నూటికి 10 మంది కిడ్నీ బాధితులే :  డా. సంతోష్ కుమార్
  • కామినేని కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్  డా. సంతోష్ కుమార్
  • అనుభవాలు షేర్​చేసుకున్న  కిడ్నీ వ్యాధి విజేతలు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా నూటికి దాదాపు10 మంది కిడ్నీవ్యాధులతో బాధపడుతున్నారని ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా పలువురు డాక్టర్లు అన్నారు. ఎల్బీనగర్ కామినేని దవాఖానలో గురువారం మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించగా, ఇందులో కిడ్నీ వ్యాధులతో బాధపడి డయాలసిస్ ద్వారా కోలుకున్న వారు, కిడ్నీ ట్రాన్స్​ప్లాంటేషన్​చేసుకున్న 30 మంది తమ అనుభవాలను పంచుకున్నారు. కామినేని కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్​ప్లాంట్​ఫిజీషియన్ డాక్టర్ ఎ. సంతోష్​కుమార్​మాట్లాడుతూ.. కిడ్నీ జబ్బులు, డయాలసిస్ అనగానే జీవితం అయిపోయినట్లుగా భావించవద్దన్నారు. ఇప్పుడున్న అధునాతన చికిత్సల ద్వారా లైఫ్​ను సమస్యలు లేకుండా లీడ్​చేయవచ్చన్నారు.

పద్మారావునగర్​: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులు ఉన్నవారు కిడ్నీ సమస్యల బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వైద్య నిపుణులు వివరించారు. అనంతరం ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా, సూపరింటెండెంట్ డాక్టర్ శోభ పాల్గొన్నారు