World Of Kalki Episode 2: కాశీ, కాంప్లెక్స్, శంభాల.. ఆరు వేల సంవత్సరాలు.. కల్కి కథ చెప్పేసిన నాగ్ అశ్విన్

World Of Kalki Episode 2: కాశీ, కాంప్లెక్స్, శంభాల.. ఆరు వేల సంవత్సరాలు.. కల్కి కథ చెప్పేసిన నాగ్ అశ్విన్

కల్కి 2898 ఏడీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆతృత పెరిగిపోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూసి సినిమా ఇలా ఉండబోతోంది అని ఒక అంచనాకు వచ్చేశారు ఆడియన్స్. కానీ, మన ఊహకు అందనిది ఈ సినిమా ఇంకా చాలా ఉందని మేకర్స్ హింట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే.. కల్కి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వీడియోస్ విడుదల చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. 

ఇప్పటికే వచ్చేసిన మొదటి ఎపిసోడ్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా రెండో ఎపిసోడ్ విడుదల చేశారు. ఇందులో భాగంగా కల్కి ప్రపంచం గురించి మరింత క్లియర్ గా వివరించాడు. కల్కి సినిమాలో కాశీ, కాంప్లెక్స్, శంభాల అనే మూడు వేరు వేరు ప్రపంచాలు ఉంటాయి. 3000 ఏళ్ళ తర్వాత కాశీ నగరం ఎలా ఉటుంది, అక్కడ మనుషులు, వారి జీవన విధానం ఎలా ఉంటుంది అనేదానిపై చాలా రీసర్చ్ చేశాం. ఆ సమయంలో అక్కడ నీళ్లు ఉండకపోవచ్చు. అలాగే కాశీలో తిరగేసిన పిరమిడ్ ఆకారంలో కాంప్లెక్స్ అనే మరో ప్రపంచం ఉంటుంది. కాశీలో లేని అన్ని అక్కడ ఉంటాయి. ఒకరకంగా అది త్రిశంకు స్వర్గం అని చెప్పొచ్చు.

ఇక శంభాల అనేది మరోక ప్రపంచం ఉంటుంది. అక్కడి మనుషులకు దేవుడి రాక అక్కడి నుండే అనే నమ్మకం ఉంటుంది. వారి అలవాట్లు, జీవనవిధానం కూడా వేరే రకంగా ఉంటాయని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. దాంతో.. ఈ మూడు ప్రపంచాల మధ్యే జరిగే కథలాగా కల్కి ఉండబోతుంది అని అర్థమవుతోంది. మరి ఈ మూడు లోకాలు ప్రేక్షకులను ఏమేరకు ఆశ్చర్యపరుస్తాయి.. జూన్ 27న రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.