అరుదైన వ్యాధుల్లో దృష్టి లోపంతో  ముడిపడినవే ఎక్కువ : ప్రొ. రామయ్య ముత్యాల 

అరుదైన వ్యాధుల్లో దృష్టి లోపంతో  ముడిపడినవే ఎక్కువ :  ప్రొ. రామయ్య ముత్యాల 
  • ఐఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ అధ్యక్షుడు ప్రొ. రామయ్య ముత్యాల 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్, ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బంజరా హిల్స్​లోని రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్​లో ‘ప్రపంచ అరుదైన వ్యాధుల దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ దర్శకుడు మురళీధర్ ఇంద్రగంటి రూపొందించిన 'ఐ యామ్ నాట్ అలోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌' షార్ట్​ఫిల్మ్​ప్రదర్శించారు.  ఐఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ అధ్యక్షులు, సీఈఓ ప్రొఫెసర్ రామయ్య ముత్యాల మాట్లాడుతూ మన దేశంలో ఎక్కువ జనాభా ఉండడం వల్ల అరుదైన వ్యాధులతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువేనన్నారు. మన దేశంలో ఐసీఎంఆర్ లిస్ట్​ప్రకారం 450 అరుదైన వ్యాధులను గుర్తించారని, ఇవి అంతర్జాతీయంగా 7 వేలకు పైనే ఉన్నాయమన్నారు. ఇందులో ఎక్కువ దృష్టి లోపంతో ముడిపడి ఉన్నాయన్నారు.

 కొన్ని వ్యాధులు క్రమంగా గుడ్డి వారవడానికి దారితీస్తాయన్నారు. సాధారణ కంటి డాక్టర్లలో ఈ వ్యాధులపై తగినంత అవగాహన లేకపోవడం, శిక్షణ పొందిన పీడియాట్రిక్, జెనెటిక్ నిపుణుల కొరత సమస్యగా మారిందన్నారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్లోని సెంటర్ ఫర్ రేర్ ఐ డిసీజెస్ కంటిపై ప్రభావం చూపే అరుదైన శారీరక రుగ్మతలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. డాక్టర్లు దినేష్ కుమార్ చిర్ల, గాయత్రి కే, అనిల్ కుమార్ మండల్, రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ ఆప్తాల్మాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సుష్మా రెడ్డి కటుకూరి, ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్​ఆప్తాల్మాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ మంజు భాటే పాల్గొన్నారు.