WPL 2024: టాస్‌ గెలిచిన ముంబై.. బోణీ కొట్టేదెవరో..

 WPL 2024: టాస్‌ గెలిచిన ముంబై.. బోణీ కొట్టేదెవరో..

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌ మొదలైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌.. రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.

తుది జట్లు:

ముంబై ఇండియన్స్‌: హేలీ మాథ్యూస్, టాలీ సీవర్‌ బ్రంట్‌, హర్మన్ ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌)‌, యస్తికా భాటియా, అమెలియా కెర్‌, అమన్‌జ్యోత్‌ కౌర్‌, సజన, పూజా వస్త్రకార్‌, షబ్నమ్‌ ఇస్మాయిల్‌, కీర్తన బాలకృష్ణన్‌, సైకా ఇషాక్‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌: షఫాలీ వర్మ, మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), అలీస్‌ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్‌, మారిజాన్ కాప్‌, అన్నాబెల్‌ సదర్లండ్‌, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, తానియా భాటియా, రాధా యాదవ్‌, శిఖా పాండే.