టెస్ట్ క్రికెట్‌లో 5వేల పరుగులు పూర్తి చేసుకున్న రహానే

టెస్ట్ క్రికెట్‌లో 5వేల పరుగులు పూర్తి చేసుకున్న రహానే

ఓవల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో టీమిండియా ఎదురీదుతోంది. 152 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ను రహానే-శార్దూల్ ఠాకూర్ జోడి ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. రహానే 89, శార్దూల్ ఠాకూర్ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలావుంటే ఈ మ్యాచులో రహానే టెస్ట్ కెరీర్‌లో 5000 పరుగులు మెయిలు రాయిని అందుకున్నాడు. ఇండియా తరపున టెస్ట్‌లలో ఆ ఘనతను సాధించిన 13వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.  

ప్రస్తుతానికి భారత్‍కు ఫాలోఆన్ ముప్పు తప్పినప్పటికీ.. ఇంకా 209 పరుగుల వెనుకంజలో ఉంది. మూడో రోజు ఆట ప్రారంభమైన రెండో బంతికే శ్రీకర్ భరత్ పెవిలియన్ చేరాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లోక్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత శార్దూల్‌తో జత కలిసిన రహానే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. వీరిద్దరూ మరో వంద పరుగులు జోడిస్తే.. ఓటమి నుంచి భారత్ గట్టెక్కైనట్లే.