డబ్ల్యూటీసీ ఫైనల్‌.. టీమిండియా బౌలింగ్

డబ్ల్యూటీసీ ఫైనల్‌.. టీమిండియా బౌలింగ్

లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్ లో టీమిండియా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  జట్టులో టీమిండియా నలుగురు పేసర్లకు చోటు కలిపించింది.  అశ్విన్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ తుది జట్టులోకి వచ్చాడు.  వికెట్ కీపర్ భరత్, రహానే తుదిజట్టులో  చోటు దక్కించుకున్నారు.  

అటు ఆసీస్‌ కూడా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. గ్రీన్‌, కమిన్స్‌, స్టార్క్‌, బోలండ్‌ తుది జట్టులో ఉన్నారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా నాథన్‌ లియోన్‌ను ఆసీస్‌ బరిలోకి దించింది. 

తుది జట్లు..

ఆస్ట్రేలియా: ఉస్మాన్‌ ఖ్వాజా, డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రవిస్‌ హెడ్‌, కెమరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ (వికెట్‌కీపర్‌), పాట్‌ కమిన్స్‌, నాథన్‌ లియోన్‌, స్కాట్‌ బోలండ్‌, మిచెల్‌ స్టార్క్‌

టీమిండియా: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్‌ భరత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌