డబ్ల్యూటీసీ ఫైనల్‌ ..  469 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ..  469 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

టీమ్‌ఇండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.  తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైంది.  ఓవర్‌ నైట్‌ స్కోరు 327/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. భారత్ బౌలర్లు పుంజుకోవడంతో మరో 142 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది.  

ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ లలో ట్రావిస్ హెడ్ (163), స్మిత్ (121) పరుగుల చేశారు.  వీరికి తోడు  అలెక్స్ క్యారీ(48), వార్నర్ (43) పరుగులు చేశారు.  భారత బౌలర్లలో సిరాజ్‌ 4 వికెట్లు తీయగా షమీ, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు. జడేజాకు ఒక వికెట్ దక్కి్ంది.   

టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.  రెండు ఓవర్లు ముగిసే టైమ్ కు 13 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (6), శుభ్ మన్ గిల్ (6) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.